- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్కీమ్ మంచిదే.. కానీ ఒకరి పొట్ట కొట్టడం కరెక్ట్ కాదు: హరీష్ రావు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించిందని తెలిపారు. దేశం గర్వపడే క్రీడాకారులను తెలంగాణ దేశానికి అందించిందని అన్నారు. వచ్చి రాగానే ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మంచిదే కానీ.. ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దని సూచించారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.15 వేల జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా ఈ సమస్యకు న్యాయం జరిగేలా చర్చిస్తామని ఆటో కార్మికులకు హరీష్ రావు హామీ ఇచ్చారు.
Advertisement
Next Story