వేర్ ఈజ్ ఈటల రాజేందర్.. లోక్‌సభ బరిలో ఉంటాడా? లేదా?

by GSrikanth |
వేర్ ఈజ్ ఈటల రాజేందర్.. లోక్‌సభ బరిలో ఉంటాడా? లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన టీ.బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక్కసారిగా కనుమరుగయ్యారు. టికెట్ల కేటాయింపు, ప్రచారం, మేనిఫెస్టో తయారీ సహా అన్నింట్లో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన.. ఫలితాల తర్వాత అనూహ్యంగా మాయమయ్యారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో బీజేపీ నేతలంతా టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్లా ఓటమి పాలైన ఈటల రాజేందర్ కూడా లోక్‌సభ బరిలో ఉంటాడని వార్తలు వినిపిస్తు్న్నాయి. మెదక్ లేదా మల్కాజ్‌గిరి టికెట్ కోసం ఇప్పటికే అధిష్టానం వద్ద పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బీజేపీలో మల్కాజ్‌గిరి లోక్‌స‌భ స్థానం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు పోటీ పడుతున్నట్లు సమాచారం. బీజేపీలోని కీలక నేతలతో పాటు విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు సైతం టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలతో కొంతమంది.. అనుచరులతో కొంతమంది నిత్యం జనాల్లో ఉంటున్నారు. అయితే, మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్న వారిలో ఈటల రాజేందర్, బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు, రఘునందన్ రావుతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్క కొమురయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇంత పోటీలో బీజేపీ ఈటలకు టికెట్ ఇస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా ఘోరంగా ఓటమి పాలైన ఆయన్ను అసలు బరిలోకి దింపుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed