- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బందుకే దిక్కులేదు.. కొత్తగా గిరిజనబంధా?: బాబూ మోహన్
దిశ, రేగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారం మీద ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల పరిష్కారం మీద లేదని బీజేపీ బీజేపీ నాయకుడు బాబూ మోహన్ విమర్శించారు. ఆదివారం రేగొండ మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో 'ప్రజా గోస - బీజేపీ భరోసా' యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా రూపిరెడ్డిపల్లి గ్రామం నుండి బైకులతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన బాబుమోహన్ మాట్లాడుతూ.. కేంద్రం ఇస్తోన్న నిధులను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మాత్రం తప్పుడు విషయాలను ప్రచారం చేస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బంధు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు ఇస్తామని ప్రకటించిన హామీనే ఇంకా నెరవేరలేదని, కొత్తగా గిరిజనబంధు ఇస్తామనగానే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. అనంతరం గోరికొత్తపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను కీర్తిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యాత్రలో రాష్ట్ర నాయకులు వేన్నంపల్లి పాపయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శులు నిషిధర్ రెడ్డి, గణపతి, ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు నాయకులు సుంకరి మనోహర్, గాలిప్, మల్లేష్, కిరణ్, కౌడగని రాకేష్, ఓమాజీ, సూర్యం తదితరులు పాల్గొన్నారు.