మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మిస్సింగ్..? సీబీఐ అదుపులో ఉన్నాడా..?

by Nagaya |   ( Updated:2022-12-01 06:51:42.0  )
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మిస్సింగ్..? సీబీఐ అదుపులో ఉన్నాడా..?
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ /డైనమిక్ బ్యూరో : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అజ్ఞాతంలోకి వెళ్లారా..? ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస్‌తో బొంతుకు లింకులున్నాయా..? సీబీఐ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారా..? గత మూడు రోజులుగా బొంతు కనిపించకుండా పోవడంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫోన్‌లు స్విచ్ఛాఫ్ కావడం.. మూడు రోజులుగా బొంతు ఆచూకీ లభించకపోవడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సీబీఐ పంజా..

తెలంగాణపై సీబీఐ పంజా విసురుతోంది. దీంతో అధికార పార్టీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారి కొమిరెడ్డి శ్రీనివాస్‌ను గత నెల నవంబర్ 28న సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు తాజాగా సీబీఐ ఏసీబీ వింగ్ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. నకిలీ సీబీఐ కొమిరెడ్డి శ్రీనివాస్ కేసులోనే వారిద్దరికి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే వీరు ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే బొంతు రామ్మోహన్ సతీమణి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిని స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిల మధ్య ప్రోటోకాల్ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై శ్రీదేవి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో తనపై హత్యాయత్నానికి కుట్రపన్నారని ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే, కార్పొరేటర్ (బొంతు సతీమణి)ల మధ్య తీవ్ర రాజకీయ దుమారం చెలరేగినా ఆయన బయట కన్పించకపోవడంతో ఇలాంటి పుకార్లు వినిపిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నేను ఎక్కడికి వెళ్లలేదు : బొంతు రామ్మోహన్

నేను ఎక్కడికి వెళ్లలేదు. నకిలీ ఐపీఎస్‌ శ్రీనివాస్‌ను ఓ ఫంక్షన్‌లో కలిశాను. మున్నురు కాపు సంఘం సమావేశాల్లో కలిసినట్లు గుర్తుంది. ఆయన చేసిన లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధంలేదు. అయిన నాకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు.. ఒకవేళ సీబీఐ నోటీసులు వస్తే తప్పకుండా సమాధానం ఇస్తానని మాజీ మేయర్ మీడియాతో వెల్లడించారు. హైదరాబాద్‌లోనే ఉన్నాను.. నేను ఎక్కడికి వెళ్లలేదు. రాజకీయ కుట్రలున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులు అందుకు నిదర్శనమే. కేసీఆర్, కేటీఆర్ మీద నమ్మకం ఉంది. ఏదైనా తప్పు చేసినట్లు భావించినా.. తనకు నోటీసులు ఇస్తే సమాధానం ఇస్తా.. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. తెలిస్తే తెలిసినట్లు చెబుతా.. లేదంటే తెలియదంటాం. మంత్రి గంగుల, ఎంపీలను కూడా శ్రీనివాస్ తెలుసా..? అని సీబీఐ అడుగుతారు.. వారు సమాధానం చెబుతారు.. రాజకీయ కక్షలు ఉండోచ్చు.. కల్వకుంట్ల కవితకు రాజకీయ కుట్రతోనే కేంద్రం ఇరికించే ప్రయత్నం చేస్తోంది. నిజం ఎప్పటికైనా బయటకు వస్తోంది. తెలంగాణ నాయకులను బదునాం చేసే కుట్ర చేస్తోంది.

Read more:

ఈడీ టార్గెట్ @పార్టీ ఫండ్

Advertisement

Next Story

Most Viewed