మాజీ హెల్త్ డైరెక్టర్ గడల వీఆర్ఎస్.. ప్రభుత్వ ఉత్తర్వులు రిలీజ్

by Gantepaka Srikanth |
మాజీ హెల్త్ డైరెక్టర్ గడల వీఆర్ఎస్.. ప్రభుత్వ ఉత్తర్వులు రిలీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు వీఆర్ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, ప్రజారోగ్య విభాగంలో జాయింట్ డైరెక్టర్ కేడర్‌లో ఉన్న ఆయనను, ప్రభుత్వం గత నెల 27న మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించింది. కానీ, ఆయన లాంగ్ లీవ్‌లో ఉండటంతో జాయిన్ అవ్వలేదు. ఇన్ చార్జ్ డీహెచ్ పోస్టు నుంచి తప్పుకున్నాక ఆయన లాంగ్ లీవ్‌లోనే కంటిన్యూ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన రెండుసార్లు వీఆర్‌ఎస్‌కు అప్లై చేయగా, తాజాగా ఆమోదిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed