- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను పూర్తి బికారిని అవుతాను! మాజీ డీఎస్పీ నళిని పోస్ట్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: స్వరాష్ట్ర సాధన కోసం డీఎస్పీ పదవి లాంటి ఉన్నత పదవికి రాజీనామా చేసిన ఉద్యమనేత నళిని సనాతన ధర్మం వైపు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఉద్యమ చరిత్రలో ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేశారని, మహిళా మూర్తులు తమ వొంటి మీద బంగారాన్ని వొలిచి ఇచ్చి, తమలోని దేశ భక్తిని చాటారని గుర్తుచేశారు. 'మహర్షి మిషన్' లో భాగంగా తాను ఫిబ్రవరి 12 న స్థాపించిన ' వేద విద్యా పరిరక్షణ సమితి (వైప్స్) ' కోసం నా ఏకైక స్వర్ణాభరణాలు ధారాదత్తం చేస్తున్నాను’ అని తెలిపారు. బంగారం విలువ 2 లక్షలు ఉంటుందని, దాతృత్వము కలిగిన ధనవంతులు ఎవరైనా 3 లక్షలకు కొనుక్కొవాలని సూచించారు.
అలాగే తాను నెలకొల్పాలని తలంచిన స్వప్న సౌధం 'వేద విద్యా కేంద్రం' కు మొదటి ఆహుతిగా తన కష్టార్జితమైన కొత్తూరు- షాద్‌నగర్‌లో ఉన్న 200 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చేస్తున్నానని పేర్కొన్నారు. దీని ప్రస్తుత విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని, దీన్ని సజ్జనులు ఎవరైనా 30 లక్షలకు కొనుక్కొని తనకు సహకరించాలన్నారు. ఈ రెండింటినీ తీసేస్తే తాను పూర్తి బికారి (సన్యాసిని)ని, విత్తేషణను జయించిన దాన్ని కూడా అవుతాని పేర్కొన్నారు. కాని తనకు బోలెడంత పుణ్యం, జ్ఞానం, యశస్సు వస్తున్నాయని, అవే తనకు చాలన్నారు. ఇక నుంచి వైప్స్ సభ్యులే తన పరివారం, వేద విద్యా కేంద్రమే తన ఆ( ని)వాసం అని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు [email protected] కి మెయిల్ చేయాలని సూచించారు. కాగా, ఇటీవల ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.