Anil Yadav: సవాల్‌ను స్వీకరించిన ఎంపీ అనిల్ యాదవ్.. కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-29 17:11:11.0  )
Anil Yadav: సవాల్‌ను స్వీకరించిన ఎంపీ అనిల్ యాదవ్.. కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) చేసిన సవాల్‌ను రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్(MP Anil Kumar Yadav) స్వీకరించారు. మంగళవారం అనిల్ కుమార్ యాదవ్ ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేసిన సవాలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సవాల్‌‌ను స్వీకరించి ఏజీ హాస్పిటల్‌(AG Hospital)కు వచ్చినట్లు తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు బీఆర్ఎస్(BRS) నేతలు వస్తారని ఎదురుచూశామని అన్నారు.

మాట మీద కౌశిక్ రెడ్డి నిలబడలేదు. వాళ్ల బాస్ కేటీఆర్‌(KTR)ను, కేసీఆర్‌(KCR)ను కూడా తీసుకొని వస్తా అన్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఒక సామెత ఉంది. ‘అరే వీడు సలీం ఫేక్ లాగా అన్ని ఫేకుతుంటాడు’ అని అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో సలీం ఫేకు లాగా కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) ఉన్నాడని విమర్శించారు. కౌశిక్ రెడ్డి రాసలీలలు గురించి చెప్పాలా? అని అడిగారు. ‘నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా తాగి పడిపోయావో మాకు అన్నీ తెలుసు. మీడియా ముందు చెప్పాలా? అని మరో సవాల్ చేశారు. సీఎం రేవంత్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి రెండూ కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy)కి లేవని సీరియస్ అయ్యారు.

Advertisement

Next Story