- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకాశ్ జవదేకర్‌తో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, పార్టీ ఎన్నికల ఇన్ చార్జీ ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో వారు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చేరికలకు సంబంధించిన అంశంతో పాటు తెలంగాణ వాస్తవిక పరిస్థితులపై చర్చలోకి వచ్చినట్లు సమాచారం. తెలంలగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు, వివిధ ప్రముఖలతోనూ వారు భేటీ అయ్యారు. తెలంగాణాలో పార్టీ పటిష్టత, ప్రభుత్వ వైఫల్యాలపై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న మార్పులపైనా ప్రస్తావించినట్లు టాక్.
ప్రకాశ్ జవదేకర్, కిరణ్ కుమార్ రెడ్డి.. భేటీ అనంతరం బ్యూరోక్రాట్లు, మాజీ బ్యూరోక్రాట్లు, మేధావులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లతో వారు చర్చించినట్లు సమాచారం. ఈ చర్చలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటి అమలు వంటి అంశాలను వారికి వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని ఎవరికి ఓటు వేసినా అది వృథా అవుతుందని వివరించినట్లు చెబుతున్నారు. ఇతర పార్టీలకు అవకాశాలు ఇచ్చారని, బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని వివరించినట్లు సమాచారం. అయితే ఇంత సీక్రెట్ గా భేటీ నిర్వహించడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఇంత అత్యవసరంగా భేటీ వెనుక గల కారణాలు ఇవేనా? ఇంకా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.