- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ విస్తరణ మరిచి బీజేపీని అడ్డకోవడమే టార్గెటా?
దిశ, వెబ్ డెస్క్: దశాబ్ధాలుగా ప్రజాసమస్యలపై పోరాటం.. పీడిత వర్గాలకు భరోసాగా నిలిచిన ఆ పార్టీలు ప్రస్తుతం తమ విస్తరణను మరిచాయి. కేవలం ఒక పార్టీని నిలువరించేందుకు తాపత్రయపడుతున్నాయి. ఎంతో మంది మేధావులు ఉన్న పార్టీకి జీవం పోయలేకపోతున్నారు. తమ ఉనికి కోసం ఇతర పార్టీలకు మద్దతు నిచ్చే పరిస్థితికి వచ్చాయి. అవే కమ్యూనిస్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఐ(ఎం)లు. కమ్యూనిస్ట్‌లు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినా తెలంగాణలో వీరికి మద్దతు లభించడం లేదు. పైపెచ్చు ఈ రెండు పార్టీలు సైతం తమ పార్టీ బలోపేతంపై క్షేత్ర స్థాయిలో దృష్టిసారించడం మరిచాయి. కేవలం బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి.
ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్ట్‌లకు కంచుకోటలా ఉన్న చోట కూడా పోటీకి దిగలేదు. బీజేపీ అభ్యర్థిని ఓడించాలనే ధృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడంలో సఫలీకృతమయ్యాయి. కానీ కేవలం బీజేపీని నిలువరించడంపైనే దృష్టి సారిస్తే తమ పార్టీల మనుగడ, విస్తరణ వంటి అంశాలను వెనకకు వెళ్తాయని గ్రహించలేకపోతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ విస్తరణ సందర్భంగా సీపీఎం, సీపీఐ(ఎం)లను మచ్చిక చేసుకున్నారు. వారి మద్దతు కూడగట్టే విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ కేసీఆర్ ఆడే చదరంగంలో తాము పావులమవుతున్నామనే విషయాన్ని ఈ రెండు పార్టీల నేతలు విస్మరిస్తున్నారు. తెలంగాణలో అనేక సమస్యలపై ఉదారంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌కు కమ్యూనిస్టు పార్టీల మద్దతు విషయమై చర్చ సాగుతోంది.
తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేకున్నా బీజేపీ ఆ అంశాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న తెరపైకి తెస్తూనే ఉంది. ఇటీవల సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో అమిత్ షాతో బహిరంగ సభ సైతం నిర్వహించింది. ఇలాంటి అంశాలపై కమ్యూనిస్టు పార్టీలు ఫోకస్ చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేసీఆర్‌తో పొత్తు, మూడు సీట్లు వంటి అంశాలు తెరపైకి తెస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. కార్మిక వర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీలపై సానుకూల దృక్పథం ఉన్నా మరిన్ని వర్గాలను అక్కున చేర్చుకోవడంపై ఫోకస్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. ప్రజలను సమస్యలపై చైతన్య పరిస్తే ఆయా వర్గాలకు చేరువయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలను మెప్పించి తెలంగాణలో ఇప్పటికైనా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బలపర్చుకుంటాయో లేదా వేచి చూడాల్సిందే.
Also Read...