హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ట్యాండ్‌బండ్‌కు స్టార్ హీరోయిన్లు

by Gantepaka Srikanth |
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ట్యాండ్‌బండ్‌కు స్టార్ హీరోయిన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్(Tankbund) వద్ద ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆదివారం సాయంత్రం ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి చేయనున్నారు. లక్కీ భాస్కర్‌(Lucky Bhaskar) సినిమాతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్లో నటించిన అంజలి(Anjali)తో పాటు మరికొందరు సినీ నటులు నేడు సాయంత్రం 6 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన హాండి క్రాఫ్ట్స్, ఫుడ్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం, ఐమాక్స్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipliganj) మ్యూజికల్ కాన్సర్ట్‌కు కూడా హాజరవుతారు.

7 గంటలకు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ షో

హెచ్ఎండీఏ ఐమాక్స్ గ్రౌండ్‌లో నేడు సాయంత్రం 7 గంటలకు ప్రముఖ గాయకుడు, లిరిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ సింప్లి గంజ్ ఆయన బృందంచే అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ జరుగనుంది. ప్రజా విజయోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్‌కు నగరవాసులనుండి అద్భుతమైన ఆదరణ లభించింది. రాహుల్ సిప్లిగంజ్ సంగీత విభావరికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో భారీ సంఖ్యలో నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాలనుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరందరూ కూడా రాహుల్ సిప్లిగంజ్ షోకు హాజరవుతారని, ఇందుకు తగ్గట్టుగా అధికారులు తగు ఏర్పాట్లను చేశారు.

Advertisement

Next Story

Most Viewed