COMPLAINT ON KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

by Prasad Jukanti |
COMPLAINT ON KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయం మరో హాట్ హాట్ గా మారింది. అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ భగ్గుమంటున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పై రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మంగళవారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే ‘చీప్ మినిస్టర్’ అని సంబోధించారని తద్వారా ముఖ్యమంత్రి పరువు, ప్రతిష్టను దెబ్బతీసేలా కేటీఆర్ కామెంట్స్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని ఢిల్లీ గులామ్ తో పోల్చడం ఇది ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీయడమే కాదని మొత్తం రాష్ట్రం ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రిని ఢిల్లీకి బానిస అని వ్యాఖ్యానించడం ద్వారా కేటీఆర్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీశారని అందువల్ల కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story