Minister Seethakka: రైతు రుణ విముక్తి తెలంగాణ ప్రగతికి నాంది: మంత్రి సీతక్క

by Mahesh |
Minister Seethakka: రైతు రుణ విముక్తి తెలంగాణ ప్రగతికి నాంది: మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు రుణ విముక్తి తెలంగాణ ప్రగతికి నాంది అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది తాము ఆరు నెలల్లోనే చేశామన్నారు. విపక్షాలకు ఇక మాట్లాడే నైతిక అర్హత లేదని ఆమె గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్షకుల కష్టసుఖాలు తెలిసిన ప్రభుత్వం తమదని చెప్పారు. అందుకే వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హమిని నిలబెట్టుకున్నామన్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అన్నదాతలకు ఏక కాలంలో రూ. రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయబోతున్నామన్నారు.

లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే నగదు జమ అయిందన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం రుణమాఫీ పండగ చేసుకుంటుందన్నారు. గత ప్రభుత్వం ఎనిమిది విడతల్లో మొక్కుబడిగా రుణ మాఫీ చేసిందని, పైగా రైతులను బ్యాంకర్లు బ్లాక్ లిస్టులో పెట్టి అవమానాలకు గురి చేశారన్నారు. తాము ఏకకాలంలో రుణ మాఫీ చేస్తూనే బ్యాంకర్లకు నుంచి ఎలాంటి సతాయింపులు లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతుందన్నారు. రైతులకు రూపాయి లాభం చేయని బీజేపీ నేతలు కూడా విమర్శలు చేయడం దారుణమని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed