- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KCR:‘ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా?’.. మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పై మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేడు(శనివారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs), ఎమ్మెల్సీ(MLC)లతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫౌంహౌజ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం(Statue of Telangana Mother) రూపు మార్చడాన్ని మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ఇదోక మూర్ఖపు చర్య. ప్రభుత్వాలు చేయవలసిన పనులు ఇవేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాల్లో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని ప్రజలకు వివరించాలి’ అని బీఆర్ఎస్ నేతల(BRS Leader)తో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఇక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.