ప్రతి వైశ్యుడు ఒక శక్తిగా మారాలి: మురంశెట్టి రాములు

by Satheesh |
ప్రతి వైశ్యుడు ఒక శక్తిగా మారాలి: మురంశెట్టి రాములు
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్ మేదోమదన సదస్సు ఆదివారం తిరుపతిలో జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర నాయకుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురంశెట్టి రాములు శ్రీ రామానుజ చిత్రం హీరో సాయి వెంకట్‌తో కలిసి సప్త సూత్రాలతో ఉన్నటువంటి బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్ భవిష్యత్ కార్యాచరణను వివిధ రాష్ట్రాల నాయకులకు, సభ్యులకు తెలియజేశారు. ప్రతి వైశ్యుడు ఒక శక్తిగా మారాలంటూ.. దానికి గురువు లాగా సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్ ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్గం చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు.

అదేవిధంగా సెంట్రల్ కమిటీ, రాష్ట్ర నాయకులకు నియామక పత్రములు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్ సెంట్రల్ జనరల్ సెక్రెటరీ బచ్చు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోతూరు శ్రీదేవి, సెంట్రల్ కమిటీ పీఆర్ఓ తేజ, ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షులు రాచపల్లి బాలాజీ, కార్యదర్శి పెద్దపల్లి వికాస్, కోశాధికారి పుట్ట శివకుమార్, కర్ణాటక శాఖ అధ్యక్షులు బీఎస్ గోవిందరాజు, కార్యదర్శి ఎంఎస్ సుబ్బలక్ష్మి, కోశాధికారి పీకే పద్మావతి, తమిళనాడు శాఖ అధ్యక్షులు నామ సతీష్ కుమార్, కార్యదర్శి అరవింద్, కోశాధికారి ఆర్‌వి ఎల్ రత్నకుమార్, మహారాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎన్ కిరణ్ చిదరవర్, కార్యదర్శి సతీష్ పాండురంగన్ వాటంవార్, తెలంగాణ శాఖ కోశాధికారి మురళీకృష్ణ మరియు రాష్ట్రాల ఉపాధ్యక్షులు, పీఆర్వోలు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed