- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఊపిరి పోయినా.. ప్రాణాలు నిలిపింది..!
దిశ, మెదక్ ప్రతినిధి: బ్రెయిన్ డెత్‌తో ప్రాణాలు పోయినా అవయవ దానం చేసి ప్రాణాలు నిలిపిన ఘటన మెదక్ మండలం మాచవరంలో చోటు చేసుకుంది. మాచవరం గ్రామానికి చెందిన ఉగ్గి అగమ్మ(56) ఈ 21న మెదక్ పట్టణం ఇండియన్ బ్యాంక్ కు వచ్చింది. తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా మోటార్ బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన కుటుంబీకులు వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆగమ్మ బ్రెయిన్ డెత్ అయిన విషయాన్ని వైద్యులు కుటుంబీకులకు చెప్పారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ ప్రతినిధులు అగమ్మ కుమారులు వీరయ్య,పోచయ్య, కుమార్తె మానసలతో మాట్లాడారు. అవయవ దానంపై అవగాహన కల్పించారు. ప్రాణాలు కోల్పోయిన ఆమె అవయవాల వల్ల మరి కొంత మందికి ప్రాణాలు నిలుస్తాయని వివరించారు. కుటుంబీకులు అంగీకరించడంతో ఆమె కాలేయం, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా బుధవారం మాచవరంలో అంత్యక్రియలు నిర్వహించారు . అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచిన వారి కుటుంబాన్ని పలువురు ప్రశంసించారు.