‘మంత్రులు బెదిరిస్తున్నారు’.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-05-20 13:10:59.0  )
‘మంత్రులు బెదిరిస్తున్నారు’.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మంత్రులపై మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మ, వరంగల్ పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఈటల సోమవారం ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో ప్రచారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయించాలని స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలను కాంగ్రెస్ మంత్రులు బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చిందని, మరీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొత్త పీఎర్సీ ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్శిటీల్లో రెగ్యులర్ నియామకాలు లేవని మండిపడ్డారు. 317 జీవోలో ఉన్న తప్పులను సరిదిద్ది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed