బీఆర్ఎస్‌ది ఎన్నికల స్టంట్.. ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు

by Javid Pasha |   ( Updated:2023-09-17 18:28:59.0  )
బీఆర్ఎస్‌ది ఎన్నికల స్టంట్.. ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విమోచన దినోత్సవాలను రాజకీయానికి వాడుకునే పార్టీ బీఆర్ఎస్సేనని, ఎన్నికల స్టంట్ వారే చేస్తున్నారని, బీజేపీ చేయడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం విమోచన వేడుకలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చాక అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బాజాప్త వేడుకలు జరుపుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. ఇదే కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ అని వ్యాఖ్యానించారని, అలాంటిది ఇప్పుడు విమోచన వేడుకలు నిర్వహించడంలో ఆయనకున్న బలహీనతలేంటో చెప్పాలని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed