- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కలెక్టర్‌పై దాడి ఎఫెక్ట్.. డీజీపీని కలిసిన ఉద్యోగ జేఏసీ లీడర్స్
దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగచర్ల(Lagacharla)లో అధికారులపై జరిగిన దాడులను ఉద్యోగ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి (Employees JAC Chairman Lacchi Reddy)అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అధికారులపై దాడులు చేయడం సరైనది కాదన్నారు. అందుకే తామంతా కలిసి డీజీపీ జితేందర్ (DGP Jithender) ను కలిసి వినతి పత్రం ఇచ్చామన్నారు. మంగళవారం సచివాలయం దగ్గర మీడియాతో లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ పై జరిగిన దాడి పట్ల సమగ్ర విచారణ జరిపించాలని కోరామన్నారు. తమ అభ్యర్థనను డీజీపీ పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) తో పాటు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ కే వెంకట్ రెడ్డి, దుద్యాల తహశీల్దార్, రెవెన్యూ ఉద్యోగులంతా భూ సేకరణపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో అక్కడ కొందరు నినాదాలు చేస్తూ కలెక్టర్, అయన బృందాన్ని విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత దాడి చేశారన్నారు. అధికారులపైనే భౌతికంగా దాడులు చేయడం వల్ల ఉద్యోగులంతా మానసికంగా కృంగిపోతారన్నారు. ఇలాంటి పునరావృతం కావద్దని, ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డీజీపీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపినట్లు లచ్చిరెడ్డి ప్రకటించారు.