- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల ఎఫెక్ట్.. ఆర్టీసీ, రైల్వేకు భారీగా ఆదాయం.. ఎంతొచ్చిందో తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వేకి భారీగా ఆదాయం సమకూరింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు, బస్సులు నడిపిన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లతో పాటు, సాధారణ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. మే 9 నుంచి 12 వ తేదీ వరకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి తదితర రైల్వే స్టేషన్‌ల నుంచి వివిధ గమ్యస్థానాలకు సుమారు 4.3 లక్షల మంది జనరల్ భోగిలో ప్రయాణికులు ప్రయాణించారు. జంట నగరాల నుంచి ప్రతి రోజు జనరల్ కోచ్‌లలో సగటున 1.05 లక్షల మంది ప్రయాణించారు. దీంతో రోజువారీ సగటున ప్రయాణించే 68,800 మంది అన్రిజర్వ్డ్ ప్రయాణికులతో పోలిస్తే 52 శాతం ఎక్కువ అని రైల్వే శాఖ వెల్లడించింది.
ఆర్టీసీకి భారీగా ఆదాయం
టీఎస్ ఆర్టీసీ సుమారు 3,500 పైగా బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు నడిపించింది. తెలంగాణలో 1,500 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌కు సుమారు వేయికి పైగా బస్సులను నడిపించింది. జేబీఎస్, ఎంబీబీఎస్ వంటి ప్రధాన బస్టాండ్లతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీకి 23 గంటల్లోనే భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. ఈ నెల 13 వ తేదీన ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. దీంతో సంస్థకు రూ. 24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఎన్నికల తెల్లారి (14న) 54 లక్షల మంది ప్రయాణించారు. టికెట్ కొనుగోలు చేసిన వారి ద్వారా ఆదాయం రూ.15 కోట్లు సమకూరాయని అధికారులు వెల్లడించారు. ఇందులో మహాలక్ష్మి స్కీమ్ ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అది ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.