- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ చేతికి 'బ్రహ్మాస్త్రం'! త్వరలోనే కొత్త సాఫ్ట్‌వేర్?
ఆర్థిక నేరాల సంఖ్య, తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇటీవలే ఈడీకి ఫుల్ పవర్స్ ఇచ్చిన కేంద్రం.. తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ఈ సంస్థకు కొత్త సాఫ్ట్‌వేర్ (కోర్ ఈడీ ఆపరేషన్స్ సిస్టమ్స్)ను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నది. 15 శాఖలకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. విభాగాల సమాచారం, డాటా, ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు, చార్జిషీట్‌లను దీని ద్వారా పరిశీలించవచ్చు. ఆర్థికంగా ఎక్కడెక్కడ అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయో ఆయా సంస్థల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తీసుకునే సౌకర్యం ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా లభిస్తుంది.
ఈడీ యాక్సెస్ చేయగల సంస్థలు..
1. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
2. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్
3. స్టేట్ పోలీస్ డిపార్టుమెంట్
4. మనీలాండరింగ్ రికార్డుల నిర్వహణ రెగ్యులేటర్
5. ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్
6. విదేశాంగ మంత్రిత్వశాఖ
7. భారత కాంపెటిషన్ కమిషన్
8. ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసే 'సిట్'
9. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్
10. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
11. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
12. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
13. మిలిటరీ ఇంటెలిజెన్స్
14. వైల్డ్ లైఫ్ కంట్రోల్ బ్యూరో
15. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసే దర్యాప్తు అథారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పావులు కదుపుతున్నది. ఆర్థిక నేరాల సంఖ్య, తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఈడీకి విస్తృతాధికారాలు కల్పించింది. మొత్తం 15 శాఖలకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేసేలా ఈడీకి పవర్స్ ఇచ్చింది. ఈ మేరకు నవంబరు 22న గెజిట్ కూడా విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా అన్ని విభాగాల సమాచారాన్ని, డాటాను, వివరాలను, డాక్యుమెంట్లను, ఎవిడెన్సులను, ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను, చార్జిషీట్‌లను పరిశీలించడానికి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నది.
'సీడాస్' పేరుతో..
కోర్ ఈడీ ఆపరేషన్స్ సిస్టమ్స్ (సీడాస్)ను అందుబాటులోకి తెచ్చుకునే అంశాన్ని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికతో ఈడీ అధికారులు పంచుకున్నారు. కన్సల్టెన్సీ సంస్థతో జరిగిన సంప్రదింపుల మేరకు ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఈడీ అధ్యయనం చేసినట్టు తెలిసింది. సాంకేతిక నిపుణులతో చర్చించిన తర్వాత ఈడీ ఉన్నతాధికారులు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే కొత్త సాఫ్ట్ వేర్ వినియోగంలోకి వస్తుందని అధికారుల సమాచారం. దీన్ని వాడడం ద్వారా ఆ 15 సంస్థలు వివిధ కేసుల్లో జరుపుతున్న దర్యాప్తు వివరాలను, సేకరించిన ఆధారాలను, డాక్యుమెంట్లను, అభియోగాలను పొందడంతో పాటు మనీ లాండరింగ్ కోణం నుంచి ఆలోచించి ఆ అంశాలపై దృష్టి పెట్టడానికి వెసులుబాటు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఒకే ఫార్మాట్‌లో..
ఆర్థికంగా ఎక్కడెక్కడ అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయో సీబీఐ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తదితర సంస్థల నుంచి ఎప్పటికప్పుడు తీసుకునే సౌకర్యం లభిస్తుంది. ఒక్కో దర్యాప్తు సంస్థ వాటికి అవసరమైన తీరులో డాటాను నిక్షిప్తం చేస్తూ ఉన్నందున వాటన్నింటినీ విడివిడిగా సేకరించి విశ్లేషించడానికి ఎక్కువ సమయం పడుతున్నది. ఇప్పుడు కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా వాటన్నింటినీ ఒకే ఫార్మాట్‌లో పొందుపర్చడానికి వీలవుతుంది. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఈ సంస్థలు చేస్తున్న దర్యాప్తు, సోదాలు, లభించిన ఎవిడెన్సు తదితరాలపై అధికారుల స్థాయిలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఈ నూతన విధానంలో ఒక కీలకమైన అంశం. రియల్ టైమ్ పద్ధతిలోనే సమాచారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది.
ఏఐ టెక్నాలజీ..
కొత్త సాఫ్ట్ వేర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుతున్నందున దర్యాప్తు ప్రాసెస్ మరింత వేగవంతమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్), ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) తదితరాలతో అనుసంధానం కావడంతో ఎప్పటికప్పుడు వివిధ కేసులకు సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులను తెప్పించుకోగలుగుతున్నారు. తాజాగా 15 సంస్థలతోనూ ఇలాంటి సమన్వయం ఉండడంతో ఆయా కేసులకు సంబంధించిన సపోర్టు డాక్యుమెంట్స్, వాటిల్లో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డు, పాన్ కార్డు, కంపెనీ ఇండెక్స్ నంబర్, డైరెక్టర్ ఇండెక్స్ నెంబర్ తదితరాలను కూడా పొందే వీలు ఉంటుంది.
ప్రస్తుతం సీసీటీఎన్ఎస్, ఐసీజేఎస్ సంస్థల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత మనీ లాండరింగ్‌కు సంబంధించి వివరాలను శోధిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారీ ఆయా సంస్థల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు (ఫిజికల్/వీడియో కాన్ఫరెన్సు)లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇకపై 15 సంస్థలతో ఆన్‌లైన్ కనెక్టివిటీ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా ఏర్పడితే మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పాయింట్ల వారీగా ఆయా సంస్థల నుంచి తదనుగుణమైన వివరాలను తీసుకోడానికి వీలు పడుతుందని వివరిస్తున్నారు. మరోవైపు దర్యాప్తులో కీలకంగా ఉండే డిజిటల్ డివైజెస్‌లోని సమాచారాన్ని, డేటాను రికవరీ చేయడానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు సైబర్ ల్యాబ్‌లు ఉన్నాయి.
కొత్తగా మరొకటీ త్వరలో అందుబాటులోకి రానున్నది. గతంలో ఒక్కో కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా రికవరీకి ఐదారు నెలలు పట్టేది. ఇప్పుడు ఐదారు రోజుల్లోనే రిట్రీవ్ చేయగలుగుతున్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారని ఆ ఆంగ్ల పత్రిక పేర్కొన్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేండ్లలో సుమారు 3,555 మనీ లాండరింగ్ కేసులు నమోదైతే.. అందులో గతేడాదిలోనే సుమారు 1200 మేర ఉన్నట్టు ఇటీవల లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. అన్ని వైపులా ఈడీకి విస్తృతాధికారాలు కల్పిస్తూ వేర్వేరు దర్యాప్తు సంస్థలతో సమన్వయం కోసం విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో రానున్న కాలంలో ఈ సంస్థ దూకుడు ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించినట్లయింది. ఇదే సందర్భంలో తెలంగాణలో సైతం జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి స్థానంలో అదనపు డైరెక్టర్ అధికారిని నియమించడం గమనార్హం.
Also Read...