- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చికోటి విచారణకు డేట్ ఫిక్స్.. ఆ కేసులో ఉచ్చు బిగించేందుకు ఈడీ రెడీ..!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈ నెల 15న ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇటీవల ఈడీ అధికారులు చీకోటికి నేపాల్ క్యాసినో కేసులో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, పాత కేసులో నోటీసులు ఇచ్చినప్పటికీ ఇటీవల వెలుగు చూసిన పటాయా క్యాసినో వ్యవహారంపైనే ఈడీ అధికారులు విచారణ జరుపనున్నట్టు సమాచారం. ఇప్పటికే పటాయా పోలీసుల నుంచి కొంత సమాచారం సేకరించిన ఈడీ అధికారులు పబ్లిక్‌డొమైన్‌లో ఉన్న సమాచారంతో చీకోటిని ప్రశ్నించనున్నట్టు తెలిసింది. థాయ్లాండ్దేశంలోని పటాయాలోని లగ్జరీ హోటల్ఏషియాలో క్యాసినో నడుస్తోందన్న సమాచారంతో పటాయా పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో చీకోటి, దేవేందర్‌రెడ్డి, మాధవరెడ్డి, సంపత్‌తో పాటు ఎనభై మూడు మంది భారతీయులు పట్టుబడ్డారు.
వీరితోపాటు థాయ్‌లాండ్, మయన్మార్పౌరులు కూడా అరెస్టయ్యారు. పటాయా పోలీసులు క్యాసినో నుంచి 20కోట్ల రూపాయల విలువ చేసే గేమింగ్చిప్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, చీకోటి అతని సహచరులు క్యాసినో నిర్వహిస్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో మరుసటి రోజే అందరూ కోర్టులో జరిమానాలు చెల్లించి విడుదలయ్యారు. కాగా, పటాయా పోలీసులు క్యాసినోలో తనిఖీలు జరిపినపుడు ఓ లాగ్బుక్దొరికింది. ప్రస్తుతం అదే కేసులో కీలక ఆధారంగా మారింది. లాగ్‌బుక్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం అయిదు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్జరిగినట్టు పటాయా పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది.
అయితే, పటాయా పోలీసులకు సంఘటనా స్థలంలో కేవలం లక్షా అరవై వేల రూపాయల భారత కరెన్సీ మాత్రమే దొరికింది. ఈ నేపథ్యంలో గ్యాంబ్లింగ్ఆడటానికి మన దేశం నుంచి వెళ్లిన ఎనభై మూడు మంది వెళ్లటానికి ముందే ఇక్కడ పెద్ద పెద్ద మొత్తాలను తెలిసిన వ్యక్తుల దగ్గర డిపాజిట్చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. పటాయాలో జరిగిన గ్యాంబ్లింగ్‌లో గెలిచిన వారికి ఓడిపోయిన వారు డిపాజిట్‌చేసిన మొత్తాల్లో నుంచి చెల్లింపులు జరిపినట్టుగా తెలిసింది. ఇదంతా హవాలా రూపంలోనే జరిగినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మరోసారి నేపాల్క్యాసినో కేసులో నిందితులుగా ఉన్న చీకోటిని ప్రశ్నించాలని నిర్ణయించినట్టు సమాచారం.
లగ్జరీ కార్లపై దృష్టి..
ఇదిలా ఉండగా ఈడీ అధికారులు చీకోటి వద్ద ఉన్న లగ్జరీ కార్లపై కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ కార్ల కొనుగోలుకు సంబంధించి చెల్లింపులు ఎలా జరిగాయి, చీకోటి తన పేరు మీద కొన్నాడా, బినామీ పేర్లతో కొన్నాడా? అన్న దానిపై ఆరా తీయనున్నట్టు సమాచారం.