- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కవితకు ఈడీ నోటీసులు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కవితకు పంపిననవి ఈడీ సమన్లు కాదని మోడీ సమన్లు అని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలు బొమ్మ, ఈడీ తోలుబొమ్మగా మారిందని ఆరోపించారు. అయితే జుమ్లా లేదా హమ్లా అన్నదే మోడీ విధానంగా మారిపోయిందని బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటి వరకు 12 మంది బీఆర్ఎస్ నాయకులపై ఈడీని, సీబీఐని పంపించారని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ఈ రకమైన దాడులకు పాల్పడుతోందన్నారు. గౌతం అదానీ ఎవరి బినామీ అని అడిగితే మోడీ బినామి అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడని అన్నారు. అదానీకి చెందిన ముద్రా పోర్ట్ లో హెరాయిన్ దొరికిందని అదానీని విచారణకు పిలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. మోడీని వ్యతిరేకించే పార్టీలను కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. 95 శాతం దాడులు విపక్షాలపైనే ఏందుకు అని ప్రశ్నించారు.
మునుగోడులో రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ఎమ్మెల్యేలను కనబోయిన దొరికిపోయిన బీఎల్ సంతోష్ మాదిరిగా మేము స్టే తచ్చుకోబోమని, జడ్జీలలో కొంత మంది బీజేపీ వాళ్లు ఉండొచ్చు కానీ కొందరు మంచి జడ్జీలు ఉన్నారన్నారు. న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి : కవిత విచారణ రోజే.. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన