- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంపీ ఎన్నికల వేళ కేసీఆర్ వరుస ట్విస్ట్ లు.. పొలిటీషియన్లకు బదులు రంగంలోకి మాజీ అధికారులు
దిశ, డైనమిక్ బ్యూరో:రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించడం సాధ్యం కాదనే టాక్ ఉంది. అందరు ఒక వైపుగా ఆలోచన చేస్తుంటే ఆయన మాత్రం మరోవైపు నుంచి వ్యవహారాలు నడిపించుకుంటూ వస్తారనే అభిప్రాయం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేదు ఫలితాలు చవి చూశాక కేసీఆర్ వ్యూహరచనపై చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో మరోసారి ఆసక్తిగా మారాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన అనుసరిస్తున్న తీరు చర్చకు దారి తీసింది. అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన పొలిటీషియన్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్న తరుణంలో గులాబీ బాస్ మాజీ అధికారులను బరిలోకి దింపడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నది.
మాజీ బ్యూరోక్రాట్లను నమ్ముకుంటున్న కేసీఆర్:
తాజాగా బీఆర్ఎస్ మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్న కర్నూల్ స్థానానికి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ స్థానానికి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం పలువురు సిట్టింగ్ ఎంపీలతో పాటు ముఖ్యనేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. దీంతో పార్టీలోని వలసలను ఆపేందుకు క్యాడర్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ అన్ని ఎంపీ స్థానాల్లో పొలిటీషియన్లను నమ్ముకోవడం కంటే మాజీ అధికారులను బరిలోకి దింపడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతోంది. అందులో భాగంగానే నాగర్ కర్నూల్, మెదక్ స్థానాలకు మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులను ఎంపిక చేయగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య డాక్టర్. దీంతో అభ్యర్థుల విషయంలో పూర్తిగా రాజకీయాల్లోనుంచి వచ్చిన వారినే కాకుండా ఇతర రంగాల నుంచి వచ్చిన వారిని అభ్యర్థులుగా పిక్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఆ నాలుగు స్థానాల్లో ఎవరో?:
ఇప్పటి వరకు బీఆర్ఎస్ మొత్తం 17 స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్, సికింద్రాబా, నల్గొండ, భువనగిరి స్థానాలకు పెండింగ్ లో ఉంచింది. దీంతో పెండింగ్ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపబోతున్నది అనేది సస్పెన్స్ గా మారింది. నిజానికి బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పరిణామం లేకపోతే ఆర్ఎస్పీ పేరు వినిపించలేదు. ఇక మెదక్ స్థానం నుంచి స్వయంగా కేసీఆర్ లేదా హరీశ్ రావు ఎవరో ఒకరు పోటీ చేయడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ జెండా పాతడం ఖాయం అనే చర్చ పొలిటికల్ కారిడార్ లో వినిపించింది. కానీ బీఎస్పీలో పరిణామాలతో బయటకు వచ్చిన ఆర్ఎస్పీ గులాబీ కండువా కప్పుకోగా ఆయనకు నాగర్ కర్నూల్ స్థానాన్ని కేటాయించగా మెదక్ నుంచి ఎవ్వరూ ఊహించని విధంగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరును కేసీఆర్ తెరమీదకు తీసుకువచ్చి ట్విస్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెండింగ్ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపనున్నారు అనేది చర్చగా మారింది.