ఆ పని చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ్యా: కేటీఆర్‌కు రఘునందన్ రావు సవాల్

by Satheesh |
ఆ పని చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ్యా: కేటీఆర్‌కు రఘునందన్ రావు సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతలు విమర్శల వేడి పెంచారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు మాటలు యుద్ధానికి దిగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్ పెంచాయి. తాజాగా బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా దుబ్బాక నియోజకవర్గంలో సొంతంగా ఇండ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రూ. 7.5 లక్షల ఆర్థిక సహయం చేయాలన్నారు. ఈ రెండు పనులు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే.. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని మంత్రి కేటీఆర్‌కు రఘునందన్ రావు సవాల్ విసిరారు.

Advertisement

Next Story