నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం

by M.Rajitha |
నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) లోని నిజామాబాద్ కు చెందిన ప్రపంచ బాక్సింగ్(World Boxing) ఛాంపియన్ నిఖత్ జరీన్(Nikhat Zareen) కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. నిఖత్ జరీన్ కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం నిఖత్ ను డీఎస్పీగా నియమిస్తూ జారీ చేసిన ఆర్డర్ కాపీని తెలంగాణ డీజీపీ జితేందర్ స్వయంగా నిఖత్ కు అందజేశారు. కాగా నిఖత్ జరీన్ ఇస్తాంబుల్ లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించింది. గత ప్రభుత్వం నజారానతోపాటు, నివాస స్థలాన్ని కేటాయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు(Arjuna Award)ను ప్రధానం చేయగా.. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్-1 కేడర్ ఉద్యోగామిస్తానని హామీ ఇచ్చి, దానిని నిలబెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed