DSC-2008: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం

by Shiva |
DSC-2008: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: డీఎస్సీ-2008 అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాలపై కసరత్తు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో 1,200 మంది డీఎస్సీ అభ్యర్థులకు కల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెరవేరబోతోంది. కాగా, తమకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ.. 2008 డీఎస్సీ బాధితులు ఇటీవలే ప్రజాభవన్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని రాష్టం నలుమూలల నుంచి 300 మంది పైగా డీఎస్సీ బాధితులు ప్రజాభవన్‌కు చేరుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఇదే విషయంపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని బాధితులు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన నెలల లోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి జీవితాల్లో వెలుగు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం, 2008 డీఎస్సీకి చెందిన వెయ్యి మంది బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed