- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రపతి నిలయం సందర్శనను వర్చువల్‌గా ప్రారంభించిన ద్రౌపది ముర్ము
దిశ, కంటోన్మెంట్: నగరవాసులకు ఉగాది శుభవార్త..బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని పౌరులకు సందర్శించే అవకాశాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కల్పించారు. ఏడాదిలో ఒక డిసెంబర్ లో మినహా మిగతా 11 నెలల పాటు అన్ని రోజుల్లో సందర్శించే వీలుంది.. బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయం సందర్శనను వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలోని నాలెడ్జ్ గ్యాలరీ, కిచెన్ టన్నెల్, విజిటర్స్ ఫెసిలిటీస్ సెంటర్స్, మెట్ల బావిని కూడా రాష్ట్రపతి ప్రారంభించారు.
ఇక ఈ నిలయాన్ని గురువారం నుంచి అన్ని రోజుల్లో సందర్శకులను అనుమతిస్తారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. రాష్ట్రపతి నిలయం విశేషాలు ప్రజలకు కూడా తెలుసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు తెలుసుకోవాలనే సందర్శనకు అనుమతి ఇచ్చినట్లె తెలిపారు. రాష్ట్రపతి నిలయం విశేషాలు నాలెడ్జ్ గ్యాలరీలో లభిస్తాయన్నారు. తెలంగాణ సంప్రదాయ కళతో కిచెన్ టన్నెల్ పునర్నిర్మాణం జరిగిందని వివరించారు. నా హయంలో బట్టర్ ప్లై,రాక్, నక్షత్ర, గార్గెన్స్ ను ప్రారంభించడం సంతోషంగా ద్రౌపది ముర్ము ప్రకటించారు.
రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు..
రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన సాంస్కృతిక కళారూపాలు ఆహుతులను అలరించాయి.