- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సోనియా కాళ్ళు మొక్కినప్పుడు గుర్తు రాలేదా? : అద్దంకి
దిశ, వెబ్ డెస్క్ : దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆరెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్న మీరు ఇంతకాలంగా తెలంగాణా తల్లి విగ్రహం పెట్టడం ఎందుకు మర్చిపోయారని, మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. మేము ఏకంగా సెక్రటేరియట్ లోపల తెలంగాణా తల్లి విగ్రహం పెడుతున్నామన్నారు. రాజీవ్ గాంధీని విమర్శించే స్థాయి మీది కాదని, మీ పార్టీ ఎప్పుడో ఖతం అయిపొయిందని విమర్శించారు. ప్రాణం పోయిన దేశం ముక్కలు కానివ్వబోనని చెప్పిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ కేవలం కాంగ్రెస్ ఆత్మగౌరవం మాత్రమే కాదని, దేశ ఆత్మగౌరవమన్నారు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామంటున్న సన్నాసులు, దద్దమ్మలకు సోనియా కాళ్ళు మొక్కినప్పుడు రాజీవ్ ఆమె భర్త అని గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. బీజేపీతో అగ్రిమెంట్ చేసుకుని ఇంకా మీరు పైకి లేస్తాం లాంటి డైలాగ్ లు వద్దన్నారు. ఫామ్ హౌజ్ నుంచి బయటకు రాని మీకు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. మరోసారి రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్న వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.