- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లె దావఖానల్లో కనిపించని డాక్టర్లు
దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో నాలుగు పల్లె దావఖానలు, మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలదు. కానీ వీటిలో మాత్రం డాక్టర్లు వచ్చే సమయం పోయే సమయం ఎవరికీ తెలియదు. ఎమర్జెన్సీ కేసులు అసలు పట్టించుకోరు, ఐదు దాటితే మండల కేంద్రంలో ఆయమ్మ తప్ప ఎవరూ కనిపించరు. ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడ వైద్యం జరగడం దేవుడు ఎరుగు కానీ, మేము వెళ్ళినప్పుడు డాక్టర్లే ఉండరు అని ప్రజలు తెలుపుతున్నారు . పల్లె ప్రజలకు సాధారణ చికిత్సలు స్థానికంగానే అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. కానీ వైద్యులు లేరన్న కారణంగా నెలల తరబడి తాళం వేసే కనిపిస్తున్నాయి. చిన్నపాటి వైద్యానికి మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రయోజనమే లేకుండా పోయింది. మండలంలోని మూడు పల్లె దవాఖానాలు వైద్యం అందడం లేదని రోగులు వాపోతున్నారు.
మండల కేంద్రానికి పది నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో దూరభారం కావడంతో అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందక ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలకు శ్రీకారం చుట్టింది. కానీ వైద్య సిబ్బంది, సౌకర్యాలు, వసతులు కల్పించకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారాయి. మారుమూల గ్రామాల ప్రజలు అనారోగ్య బారిన పడి కష్టాలు పడుతున్నారు. ఊరు దాటి బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో స్థానిక వైద్యాన్ని నమ్ముకుంటూ అనారోగ్య బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతవేటు దూరంలో జిల్లా కార్యాలయం ఉన్న ఎవరూ పర్యవేక్షించారు. పల్లె దావఖానలో ఉండాల్సిన డాక్టర్లు మండల కేంద్రంలో వర్క్ చేస్తారు. గ్రామాలలో ప్రజల పరిస్థితి అడిగి నాథుడే ఉండడు. ఎమర్జెన్సీ వస్తే భువనగిరి తరలించడం తప్ప ఇక్కడ ఏ వైద్యం జరగదని పలువురు తెలుపుతున్నారు. ప్రజల ముంగిటే వైద్య సేవలందించాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు చేరువలో ఆరోగ్యం అందించడం కోసం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలు అందని ద్రాక్షలా మారాయి.