- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్పామ్ కాల్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా..? తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: పదే పదే స్పామ్ కాల్స్ (spam calls) ఎందుకు వస్తున్నాయి అని తెలంగాణ పోలీస్ (Telangana Police) ట్వీట్ (tweeted) చేసింది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు (cyber criminals) రెచ్చిపోతున్నారు. ప్రజలను స్కాముల్లో (scams) ఇరికించి, మోసం చేసేందుకు కొత్త కొత్త స్కీములు (new schemes) అమలు చేస్తున్నారు. ఈ స్కీములను నమ్మి అమాయక ప్రజలే గాక, చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు (software employees) సైతం మోసపోతున్నారు. ఈ మోసాలతో సైబర్ నేరగాళ్లు లక్షలు వెనకేసుకొని ఉడాయిస్తున్నారు. ఈ స్కాముల నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు.
సైబర్ నైరాలపై (Cyber Crimes) ప్రజలకు అవగాహన కల్పించేందుకు (creating awareness) తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటున్నారు. ఇందుకోసం సామాజిక అవగాహనా కార్యక్రమాలు (social awareness programs) చేపట్టడంతో పాటు సోషల్ మీడియాలోనూ (social media) పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ.. అమాయక ప్రజలు సైబర్ నేరాలకు గురి కాకుండా అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలోనే స్పామ్ ఫోన్ కాల్స్ (spam phone calls) పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ట్వట్టర్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇందులో పదే పదే స్పామ్ కాల్స్ ఎందుకు వస్తున్నాయి? అంటూ.. అలాంటి కాల్స్ వస్తే ఊరికే వదిలేయొద్దని తెలిపింది.
ఎక్కడ పడితే అక్కడ మొబైల్ నంబర్స్ (mobile numbers) ఇవ్వొద్దని, ఏదైనా వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ (registration) కోసం వివరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని (personal information) షేర్ చేసేముందు బాగా ఆలోచించాలని చెబుతూ.. లక్కీ డిప్ (Lucky Dip) కోసం వివరాలు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని, మీరు ఇచ్చే వివరాలే స్పామ్ కాల్స్ కు కారణమని గుర్తుంచుకోండి అని హెచ్చరించింది. ఇక దీనిపై మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మిమ్మల్ని సైబర్ మోసాల బారిన పడేలా చేస్తాయని తెలిపింది. ఎక్కడపడితే అక్కడ మొబైల్ నంబర్స్, అడ్రస్ ఇవ్వొద్దని, గిఫ్ట్స్ (gifts), లక్కీడిప్ పేరిట వచ్చే కాల్స్‌కు స్పందించొద్దని తెలంగాణ పోలీస్ కీలక సూచనలు చేసింది.