- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pm Modi: ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ వద్దు.. ప్రధాని మోడీకి బీజేపీ ఎంపీల మెమరాండం
దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ ను అమలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఎస్సీ, ఎస్టీలకు క్రిమిలేయర్ పరిశీలనపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్ హౌస్ లో సుమారు 100 మంది బీజేపీకి చెందిన లోక్ సభ, రాజ్యసభకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ప్రధానిని కలిసి తమ సామాజిక వర్గాలకు క్రిమిలేయర్ వద్దని మెమొరాండం అందజేశారు. తమ విజ్ఞప్తిపై ప్రధాని సాకుకూలంగా స్పందించినట్లు ఈ సమావేశం అనంతరం ఎంపీలు మీడియాకు వెల్లడించారు. ఎంపీల సమావేశానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ సైతం తన వ్యక్తిగత ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ రోజు ఎస్సీ/ఎస్టీ ఎంపీల డెలిగేషన్ సమావేశం అయిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత కోసం నిబద్ధతతో ఉన్నామని పునరుద్ఘాటించారు.