బ్రేకింగ్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై డీకే అరుణ అనూహ్య నిర్ణయం

by Satheesh |   ( Updated:2023-11-01 11:50:05.0  )
బ్రేకింగ్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై డీకే అరుణ అనూహ్య నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కాగా, గత కొన్ని రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేయడం లేదని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు.

ఈ నెల చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని డీకే అరుణ ఇవాళ తేల్చి చెప్పారు. తన స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. కాగా, డీకే అరుణ గద్వాల్ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఆమె గద్వాల్ నుండి బరిలోకి దిగుతారని ప్రచారం జరగగా.. డీకే అరుణ మాత్రం పోటీకి దూరంగా ఉంటూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed