- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ సంక్షోభానికి రీజనేంటి.. బీజేపీ హైకమాండ్ సీరియస్ ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీలో లేని సంక్షోభాన్ని సృష్టిస్తున్నది ఎవరంటూ బీజేపీ హై కమాండ్ ఆరా తీస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీలో గ్రూపులు, వర్గాలు ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఎన్నికల టైమ్‌లో పార్టీని బలహీనపర్చేందుకు జరుగుతున్న ప్రయత్నంగానే భావిస్తున్నది. ఏ వ్యక్తుల ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వంగా మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నది. పార్టీలోని అంతర్గత వివరాలు బయటకు పొక్కుతుండడంతో తొలుత కోవర్టులు ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేసినా, ఇటీవల ఢిల్లీ కేంద్రంగా మీడియా ద్వారా స్వప్రయోజనాలను నెరవేర్చుకోడానికి లీకుల వ్యవహారం నడిపించడాన్ని సీరియస్‌గా తీసుకున్నది.
నేతల టూర్ల కంటే ముందే..
అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోడీ తెలంగాణ టూర్లను పురస్కరించుకుని తక్షణం ఈ గ్రూపుల, వర్గాల సంస్కృతికి తెర దించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నది. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గందరగోళం సృష్టించడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగానే లెక్కిస్తున్నది. ఈ చర్యలకు పాల్పడుతున్న నేతల వివరాలపై హైకమాండ్ ఆరా తీస్తున్నది. ఢిల్లీ కేంద్రంగానే తెలుగు, ఇంగ్లీషు మీడియాకు ఫోన్లు చేసి మరీ లీకులు ఇవ్వడాన్ని ఉపేక్షించవద్దని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా గ్రూపు పాలిటిక్స్ చోటుచేసుకుంటున్నాయని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పార్టీ లైన్ కి భిన్నంగా..
రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులుంటాయని, స్టేట్ చీఫ్ మారుతారని, కొద్దిమందికి సమాంతరంగా కీలకమైన బాధ్యతలు వస్తాయని.. ఇలా అనేక రకాల వార్తలు ప్రసార మాధ్యమాల్లో రావడాన్ని జాతీయ నాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి గ్రూపుల కల్చర్ లేదని, తెలంగాణలో మాత్రమే ఇటీవల పొడసూపడాన్ని సహించే ప్రసక్తే లేదనే అభిప్రాయానికి వచ్చింది. పార్టీ లైన్‌కు భిన్నంగా, విధానాలకు విరుద్ధంగా పార్టీ నాయకత్వంలో మార్పులు జరిగే అవకాశం లేనప్పటికీ మీడియా ద్వారా గందరగోళం సృష్టించే ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది. ఇటీవల ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న వారి వివరాలు, ఉద్దేశాలను వెలికితీసే ప్రయత్నం మొదలైంది.
డిసిప్లినరీ యాక్షన్!
పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిని గుర్తించి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని హై కమాండ్ భావిస్తున్నది. పద్ధతి మార్చుకోకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ఆలోచన చేస్తున్నది. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, మరో వ్యక్తికి ప్రయోజనం కలిగేలా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక మాజీ శాసనసభ్యుడు గుట్టుచప్పుడు కాకుండా మీడియాకు లీకులు ఇస్తున్నట్లు ప్రాథమిక వివరాలను సేకరించినట్లు తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం పార్టీ నాయకత్వంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడమే కాకుండా, కేడర్‌ను నీరుగార్చే వ్యవహారంగా భావిస్తున్నది. ఇలాంటి యాక్టివిటీస్‌ను సహించే ప్రసక్తే లేదని, ఇప్పుడు తుంచివేయకపోతే భవిష్యత్తులో మరింత డ్యామేజ్ తప్పదనే అంచనాకు వచ్చింది.
త్వరలో సీనియర్లతో సమావేశాలుTelugu News, Latest Telugu News
స్టేట్ యూనిట్‌లో టీమ్ ఫంక్షనింగ్‌కు బదులుగా సమాంతర వ్యవస్థ తరహాలో జరుగుతున్న వ్యవహారానికి బీజేపీ హై కమాండ్ మంగళం పాడాలనుకుంటున్నది. పార్టీలో కోవర్టులున్నారనడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తును పార్టీకి అంటగట్టడం, కవిత అరెస్టుపై కామెంట్లు చేయడం, రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉంటుందనే లీకులు ఇవ్వడం, హైకమాండ్ నుంచి ఆహ్వానం లేకపోయినా ఢిల్లీకి రావడం.. ఇలాంటి అంశాలన్నింటినీ రెండు, మూడు రోజుల్లోనే జాతీయ నాయకత్వం కొలిక్కి తేవాలనుకుంటున్నది. ఈ నెల 15న ఖమ్మం టౌన్‌లో జరిగే బహిరంగసభకు అమిత్ షా వస్తుండడంతో ఒక రోజు ముందుగానే కొద్దిమంది స్టేట్ లీడర్లతో తరుణ్‌చుగ్, మరికొద్దిమంది సమావేశమై గాడిలో పెట్టాలనుకుంటున్నది. అవసరమైతే విడివిడిగా సీనియర్ నేతలతో సమావేశమై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో టీమ్ ఫంక్షనింగ్‌ను స్ట్రాంగ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. పార్టీ లైన్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నవారిని గట్టిగానే హెచ్చరించాలనుకుంటున్నది. హైకమాండ్ నుంచి పార్టీ స్టేట్ యూనిట్‌లో మార్పులు చేర్పుల గురించి ఎలాంటి ప్రకటన లేకపోయినా ఉద్దేశపూర్వకంగా సృష్టించి వ్యక్తిగతంగా ప్రయోజనాలు పొందడం, హైప్‌ను క్రియేట్ చేయడాన్ని నివారించాలనుకుంటున్నది. తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, జాతీయ నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు.. వివిధ స్థాయిల్లోని లీడర్లందరితో ఉమ్మడి భేటీ జరిపి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నది. ఈ నెల చివరికల్లా మొత్తం వ్యవస్థను గాడిన పెట్టడాన్ని ప్రయారిటీ కార్యక్రమంగా భావిస్తున్నది.