- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జిల్లా VS స్టేట్.. ‘కాంగ్రెస్’లో ఆగని ఫైట్..!
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కలహాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా నాయకులు వర్సెస్ స్టేట్లీడర్ల తరహాలో ఫైట్‌లు జరుగుతున్నాయి. మండల కమిటీల ఏర్పాటులో నిత్యం కొట్లాటలు షరా మూమూలు అయ్యాయి. డీసీసీ నియమిస్తున్న సభ్యులపై స్టేట్ కమిటీ వేటు వేస్తూ షాక్‌లు ఇస్తున్నది. దీంతో కాంగ్రెస్ లీడర్లు ఖంగు తింటున్నారు. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో ఇలాంటి సమస్య ఉన్నదని, వెంటనే న్యాయం చేయాలని ఇన్ చార్జి పాల్వాయి స్రవంతి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి థాక్రేకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో క్రమంగా కమిటీల కుమ్ములాటలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల కాంగ్రెస్ లీడర్లు బయటకు వచ్చి హై కమాండ్‌కు ఫిర్యాదు చేస్తుంటే.. మరికొందరు అసంతృప్తి వెల్లడించడానికే పరిమితం అవుతున్నారు. ఈ విభేదాలతో కాంగ్రెస్ కేడర్చీలిపోతున్నది. అధికారంలోకి తెచ్చేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్, ఇతర ముఖ్య నాయకులు ప్రయత్నిస్తుంటే, ఈ మండల కమిటీల ఏర్పాటు నేపథ్యంలో జరుగుతున్న విభేదాలు ఆ పార్టీ ముఖ్య నాయకులకు తలనొప్పిగా మారాయి.
అంతటా ఇదే లొల్లి..
ఇటీవల నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నార్కట్ పల్లి, కట్టంగూర్ నూతన మండల అధ్యక్షులను నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ నియమించారు. నకిరేకల్ మండల అధ్యక్షుడు యాస కర్ణాకర్ రెడ్డి, నార్కట్ పల్లి మండల అధ్యక్షుడు పాశం శ్రీనివాస్ రెడ్డి, కట్టాంగూర్ మండల అధ్యక్షుడు ముక్కముల శేఖర్ యాదవ్, నకిరేకల్ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్నకు నియామక పత్రాలను అధికారికంగా అందజేశారు.
అయితే కొన్ని గంటల్లోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రకటించిన మండల కాంగ్రెస్ కమిటీలు చెల్లవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కమిటీల ఏర్పాటులో తన ప్రతిపాదనలను డీసీసీ అధ్యక్షులు స్థానిక ముఖ్య నాయకులతో చర్చించి ఇన్‌చార్జిలకు ఏప్రిల్ 20వ తేదీలోగా పంపించాలని సూచించారు. అనంతరం వాటిని పరిశీలించి పీసీసీ మాత్రమే ఫైనలైజ్ చేస్తుందన్నారు. దీంతో డీసీసీతో పాటు మండల కమిటీల్లో ఎంపికైన అధ్యక్షులు షాక్‌కు గురయ్యారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
స్టేట్ లీడర్ల జోక్యంపై డీసీసీల అసంతృప్తి..
కాంగ్రెస్ పార్టీ మండల కమిటీల్లో స్టేట్లీడర్లు జోక్యం చేసుకోవడంపై డీసీసీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నోళ్లను కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తుంటే ముఖ్య లీడర్ల ఒత్తిడి మేరకు కమిటీల్లో ఇతరులకు అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీ డ్యామేజ్ అవుతున్నదని, ఇప్పటికే కార్యకర్తలంతా చీలిపోయినట్లు స్పష్టమవుతోంది. పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో ఇలాంటి ఇష్యూలు కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టివేస్తున్నాయి. స్టేట్ కేడర్ లీడర్ల మద్దదారులకు పోస్టులు ఇస్తే తమతో కేడర్ఎలా బలోపేతం అవుతుందని? డీసీసీలు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇదంతా రేవంత్‌కు తెలిసి జరుగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నదని పార్టీలోని ఓ ముఖ్య నాయకుడు తెలిపారు.