- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Jupalli Krishna Rao : ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు..
దిశ, కొల్లాపూర్ : ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. బుధవారం పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్ లో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కోడేరు మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 412 మంది లబ్ధిదారులకు మంత్రి జూపల్లి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మండల కార్యాలయాలకు కళ్యాణ లక్ష్మీ పనుల మీద వచ్చే ప్రజలను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రెవెన్యూ అధికారులు చూసుకోవాలని సూచించారు.
ఇంకా ఏమైనా ఫైల్స్ పెండింగ్ లో ఉంటే వాటి మీద కూడా అధికారులు త్వరగా విచారణ చేసి ప్రపోజల్స్ పంపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజు, తహశీల్దార్ విష్ణు వర్ధన్ రావుగ, మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మహెమూదా బేగం, కౌన్సిలర్లు రహీం పాషా, మేకల శిరీష, శ్రీదేవి గౌతం గౌడ్, కర్నే అలివేలు, చిట్టెమ్మ రవి, బోరెల్లి కరుణ మహేష్, నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.