- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో తొలిసారి ప్లకార్డుల ప్రదర్శన
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులను ప్రదర్శించారు. నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ వాయిదా ప్రతిపాదన ఇచ్చారు. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడాలని, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మెగా డీఎస్సీ వేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, నిరుద్యోగులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, హామీలను అడిగిన నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని, వారి పక్షాన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అనంతరం ప్లకార్డులతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. మీడియా పాయింట్ వరకు ప్లకార్డులతోనే ఎమ్మెల్యేలు వెళ్లారు.
బీజేపీ వాకౌట్
అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో చర్చ నిర్వహించారు. చర్చలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అయితే ఆసమయంలో కేంద్రం ఇచ్చిన నిధులు వివరించడంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ కు నిధులు కేటాయించలేదని, దానిపై విమర్శలు చేశారు. దీనిపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మైక్ కట్ చేశారు. మైక్ ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన విన్నపాలను సైతం పట్టించుకోలేదు. దీంతో సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.