Disha Effect: "య్యూట్యూబర్ హంగామా" దిశ పత్రిక‌లో కథనం.. యూట్యూబర్‌పై కేసు నమోదు

by Ramesh Goud |
Disha Effect: య్యూట్యూబర్ హంగామా దిశ పత్రిక‌లో కథనం.. యూట్యూబర్‌పై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: "య్యూట్యూబర్ హంగామా" అంటూ దిశ పత్రిక లో వచ్చిన కథనంపై పోలీసులు స్పందించారు. యూట్యూబర్ హర్షపై సనత్ నగర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ యువకుడు ట్రాఫిక్ మధ్యలో డబ్బు విసురుతూ రీల్స్ చేశాడు. అక్కడే ఉన్న కొందరు వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. ట్రాఫిక్ మధ్యలో ఆ యువకుడు చేసిన హంగామాకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై దిశ పత్రికలో "యూట్యూబర్ హంగామా", 'రోడ్డుపై రీల్స్ నోట్లు విసురుతూ హల్ చల్, ఇన్ స్టాలో రీల్స్ కోసం స్టంట్స్, వాహనదారుల ఇబ్బందులు అని కథనం ప్రచురితమైనది. దిశ కథనంపై స్పందించిన పోలీసులు.. రోడ్డుపై డబ్బు విసురుతూ హంగామా చేసిన యువకుడి పేరు హర్ష అని, రీల్స్ చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం సహా పలు సోషల్ మీడియా అకౌంట్లలో అప్ లోడ్ చేస్తుంటాడని, నెట్టింట ఫేమస్ అవ్వడం కోసం ఇదంతా చేశాడని గుర్తించారు. దీంతో పోలీసులు అతనిపై సనత్ నగర్, కేపీహెచ్‌బీ పీఎస్ లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed