- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Munugode By Elections: టీఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తోన్న మునుగోడు నేతలు.. మంత్రి బుజ్జగించినా నో యూజ్!
దిశ ప్రతినిధి, నల్లగొండ: Differences among TRS leaders for Munugode by elections to the fore again| టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం భగ్గుమంటోంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అభ్యర్థిత్వం ఖరారుపై టీఆర్ఎస్ పార్టీలోని ఆశావాహుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్‌లో టికెట్ ఆశించే వారి జాబితా పెద్దగా ఉంది. ఇందులో బీసీ సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మొదట్నుంచీ నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి నేరుగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఓకేనంటూ తల ఊపిన నేతలు.. ఏకంగా 300 మందితో సమావేశం కావడంతో షాక్ తగిలినట్టయ్యింది. ఓవైపు మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఈనెల 20న నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు చూస్తుంటే.. మరోవైపు టీఆర్ఎస్ నేతలు ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఆ పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం గమనార్హం.
కూసుకుంట్లకు వ్యతిరేకంగా సమావేశం
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహించబోమని లోకల్ టీఆర్ఎస్ లీడర్లు గళమెత్తారు. అంతటితో ఆగకుండా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ చౌటుప్పల్ పరిధిలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన దాదాపు 300 లీడర్లు రహస్యంగా భేటీ అయ్యారు. పార్టీ అధిష్టానం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తే.. ఏం చేయాలనే దానిపైనా చర్చించినట్టు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలతో పలువురు క్రీయాశీలక కార్యకర్తలు హాజరయ్యారు. ఏదీఏమైనా ఈసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు టికెట్ కేటాయిస్తే.. మేం ఓడించి తీరుతామంటూ సొంత పార్టీ నేతలు శపథం చేయడం కలకలం రేపుతోంది.
మంత్రి బుజ్జగించినా.. నో యూజ్..
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఉపఎన్నిక అంశం తెరపైకి రాకముందు నుంచే స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బాహాటంగానే పలుమార్లు ఆయన్ను వ్యతిరేకించిన దాఖలాలు లేకపోలేదు. ఇటీవల ఉపఎన్నిక ప్రస్తావన వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ఆశావాహులు, లోకల్ లీడర్లు కూసుకుంట్లను వ్యతిరేకిస్తూనే వచ్చారు. కానీ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి కూసుకుంట్ల వైపు మొగ్గుచూపుడంతోనే సీఎం కేసీఆర్ సైతం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి తమ అసమ్మతి రాగాన్ని విన్పించేందుకు లోకల్ లీడర్లంతా భేటీ కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదిలావుంటే.. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తోన్న కర్నాటి విద్యాసాగర్, బూర నర్సయ్యగౌడ్, నారబోయిన రవిలకే కేటాయించాలనే డిమాండ్ స్పష్టంగా విన్పిస్తుండడం గమనార్హం.
ఇది కూడా చదవండి: సిరిసిల్ల కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. బీజేపీలోకి మహేందర్ రెడ్డి?