- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేందర్ రెడ్డి మీకులా లిక్కర్ స్కామ్ చేశాడా? కవితకు కొండా సురేఖ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై, అవినీతి మరక ఉన్న టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డిని నియమించడంపై కవిత చేసిన విమర్శలకు కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. మహేందర్ రెడ్డిపై అవినీతి మరక ఉంటే ఆయన్ను డీజీపీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మంత్రి.. టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం జరిగిని రెండు వారాలే అయిందని అప్పుడే ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 36 ఏళ్లుగా ఆయన వివిధ హోదాల్లో పని చేశారని ఆయన ఏమైనా లిక్కర్ స్కామ్ చేశారా? లేకా పేపర్లు లీక్ చేశారా? అని సెటైర్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తి కాలేదని, రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన వారు అప్పుడే మాపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర కాంట్రాక్టర్లను పెంచి పోశించింది కేసీఆర్ కుటుంబమే అన్నారు. సింగరేణిలో 20 వేల ఉద్యోగాలు తామే ఇచ్చామని చెప్పుకోవడానికి కవిత సిగ్గుపడాలన్నారు. సింగరేణు నిధులు సిరిసిల్ల, గజ్వేల్ కు తరలించుకుపోయింది ఎవరని ప్రశ్నించారు. మాట నిలబెట్టుకుంటామనే అక్కసుతోనే మాపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.