పంట నష్టం వివరాలను అందించాలి.. కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు

by Anjali |   ( Updated:2023-04-24 15:24:11.0  )
పంట నష్టం వివరాలను అందించాలి.. కలెక్టర్లకు సీఎస్​    ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అకాల వర్షాలతో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్​ శాంతికుమారి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను మే ఒకటవ తేదీలోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి జరిగిన పంట నష్టం వివరాలను సమర్పించాలని కోరారు.

గతంలో జరిగిన పంట నష్టాన్ని సోమవారం నుండి పంపిణి చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణ కేంద్రాలలో ఉన్న వరి ధాన్యం తడవకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ హనుమంత రావు లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Advertisement

Next Story