అర్ధరాత్రి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్

by Mahesh |   ( Updated:2023-01-22 06:30:05.0  )
అర్ధరాత్రి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఐఏఎస్‌ అధికారినికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి అర్థరాత్రి చొరబడ్డారనే ఆరోపణలతో మేడ్చల్‌ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి తలుపులు తీసి డిప్యూటీ తహసీల్దార్ లోపలికి వెళ్లారు. దీంతో అధికారి పట్ల అభ్యంతకరంగా ప్రవర్తించినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే, రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మితా సబర్వాల్ ట్వీట్‌లను ఆనంద్‌ కుమార్‌ ఒకటికి రెండు సార్లు రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటలకు తన స్నేహితుడైన హోటల్ యజమానితో కలిసి ఆమె నివాసానికి వెళ్లాడు. సిబ్బందికి అనుమానించకుండా లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో, స్నేహితుడిని కారులో వదిలి డిప్యూటీ తహసీల్దార్ ఐఏఎస్ అధికారిని ఇంట్లోకి వెళ్లాడు. గది తలుపు తట్టాడంతో డోర్ తెరిచిన ఐఏఎస్ అధికారిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఎదురుగా రావడంతో షాక్ తిన్నారు. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావని గట్టిగా అడిగింది.

తన పని గురించి మాట్లాడేందుకు వచ్చానని బదులిచ్చాడని సమాచారం. ఈ క్రమంలో మహిళా ఐఏఎస్‌ అధికారి అరవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌ రెడ్డి అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. డీటీ తో పాటు వచ్చిన స్నేహితుడిని కూడా పోలీసులకు అప్పగించారు. వారి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ..డ్యూటీ విషయంపై వచ్చానని డిప్యూటీ తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్మితా సబర్వాల్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. తన ఇంట్లోకి డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ చొరబడటంతో అప్రమత్తతతో ప్రాణాలు కాపాడుకున్నానని స్మితా సబర్వాల్ తెలిపారు.

'రాత్రి అత్యంత బాధాకరమైన ఘటన జరిగింది. రాత్రి ఓ వ్యక్తి నా ఇంట్లోకి చొరబడ్డాడు. అప్రమత్తతతో ప్రాణాలు కాపాడుకున్నా. మీరు ఎంత సురక్షితంగా ఉన్నామని అనుకున్నా..ఇంటి తలుపులు, తాళాలు వేసారో లేదో ఒకటి రెండు సార్లు తనిఖీలు చేయండి. అత్యవసరమైతే 100 కు డయల్ చేయండి' అని ట్వీట్ చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషించే మహిళా ఐఏఎస్ అధికారినికి ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయంటే రాష్ట్రంలో మిగతా మహిళల పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి :

కేటీఆర్‌కు ఈ విషయం తెలిస్తే నిద్ర పట్టదనుకుంటా..!

ఐఏఎస్ ఆఫీసర్‌కే భద్రత లేదు.. ఇదేనా తెలంగాణ మోడల్: రేవంత్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed