Deputy CM: అలాంటి వారిని ఎవరినీ మర్చిపోం.. అందరికీ పదవులు ఇస్తాం

by Gantepaka Srikanth |
Deputy CM: అలాంటి వారిని ఎవరినీ మర్చిపోం.. అందరికీ పదవులు ఇస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు చేయడం ప్రారంభించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని అన్నారు. ఇందుకోసం ప్రతినెలా ఏకంగా రూ.400 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని వెల్లడించారు.

ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నాం.. మళ్లీ ప్రజలకే పంచుతున్నామని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో పోరాటం చేశారని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా బెదరలేదు, భయపడలేదని అన్నారు. పార్టీకి సేవ చేసిన ఎవరినీ మరువబోమని.. అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పదవులతో పాటు గౌరవం ఇస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed