- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM Bhatti Vikramarka: వీలైతే అంతకుమించి వడ్డీలేని రుణాలు ఇస్తాం
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకర్లు(Bankers) హైడ్రా(Hydra) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైడ్రా(Hydra) భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. బుధవారం ప్రజాభవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ(GHMC), టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు. హైడ్రా(Hydra) సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, అక్రమార్కులు పార్కులు, సరస్సులు ఆక్రమించుకోకుండా చూస్తుందని తెలిపారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూతను అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులోనూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని అన్నారు. ఈ సమావేశం ఏర్పాటుకు చొరవ చూపిన బ్యాంకర్లు, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు(Special CS Ramakrishna Rao)లను డిప్యూటీ సీఎం(Deputy CM Bhatti Vikramarka) అభినందించారు.
ఆది ప్రజా ప్రభుత్వం, ప్రజల పట్ల కమిట్మెంట్తో ఉన్నామని డిప్యూటీ సీఎం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం కేవలం మహిళలు ఊరికే తిరగడానికి అని కొంతమంది అనుకుంటారు.. అది వాస్తవం కాదని తెలిపారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవం మర్యాదలతో జీవించేందుకు దోహద పడుతుంది అన్నారు. మహిళలు బయటకు రావాలి ప్రపంచాన్ని చూడాలి, అవకాశాలు తెలుసుకోవాలి.. వ్యాపారాలు చేయాలి ఆర్థికంగా బలోపేతం కావాలి.. కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశం అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు అధికంగా బలోపేతం అవుతారు, తద్వారా కుటుంబం బలోపేతం అవుతుందని వివరించారు.
స్వయం సహాయక సంఘాల(swayam sahayaka sangam)కు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ కేబినెట్ నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు తొమ్మిది నుంచి.. 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి, బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి.. రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళ తరం చేయాలని కోరారు. ప్రైవేటు విభాగాల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాల రికవరీ శాతం తక్కువగా ఉంటుంది.. అదే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం చూస్తే 98 శాతానికి పైగా ఉందని.. బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని అన్నారు.
మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, మధ్యతర (smse) పరిశ్రమ క పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. బ్యాంకర్లు విశాలా దృక్పథం గొప్ప హృదయంతో సహకరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు 12 వేల కోట్ల పైగా టర్నోవర్ చేస్తున్నారు.. ఇదే సమయంలో గిరిజన ప్రాంతాల్లోని సంఘాలు సుమారు 200 కోట్ల వరకు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. వారు తీసుకున్న రుణాలు మాఫీ చేయడం లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని తెలిపారు.
హైదరాబాదులో 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించాం, వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయం తర్వాత పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేది సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలే (MSME). పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకువస్తున్నాం, బ్యాంకర్లు సహకరించాలని కోరారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా, ప్రోగ్రెసివ్ స్టేట్‌గా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నాం.. బ్యాంకర్లు విస్తరించాలని కోరుకుంటున్నాం.. బ్యాంకర్లు పెరిగితే రాష్ట్రం పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, SERP సీఈఓ దివ్యదేవరాజన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.