- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలపై భారమొద్దు.. బడ్జెట్ కూర్పుపై డిప్యూటీ సీఎం దిశానిర్దేశం
దిశ, తెలంగాణ బ్యూరో: వాస్తవిక అంచనాలతోనే బడ్జెట్‌ను రూపొందించాలని, ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాలు, వ్యవసాయం, మార్కెటింగ్, టెక్స్ టైల్స్ తదితర శాఖలపై సచివాలయంలో గురువారం జరిగిన రివ్యూ సందర్భంగా ఆయా శాఖల తరఫున బడ్జెట్ కేటాయింపులు, గతంలో ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, మరికొన్ని అంవాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు డిప్యూటీ సీఎం కీలక సూచనలు చేశారు. రానున్న బడ్జెట్‌లో ఆరు గ్యారంటీల అమలుకు అవసరమయ్యే నిధుల కేటాయింపు, వాటిని సమకూర్చుకోడానికి ఉన్న ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ డిపార్టుమెంటు అధికారులు ఆదాయాన్ని ఆర్జించడానికి ఇప్పటికే లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూముల వివరాలను స్టడీ చేయాలని, గడువు ముగిసినవాటిపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రభుత్వ ఆస్తులు కొద్దిమంది గుప్పిట్లోకి వెళ్ళిపోయాయని, ప్రభుత్వ భూములు సైతం వారి అజమాయిషీలో ఉన్నాయని, వాటి లెక్కలు తీసి సమగ్రమైన నివేదికను రూపొందించాలన్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో నక్సలైట్లతో ప్రభుత్వం శాంతి చర్చలు జరిపినప్పుడు ప్రస్తావనకు వచ్చిన అంశాల్లో భూములపై హక్కులు, పేదల పోరాటాలు కూడా ఒక అంశమని, వీటిని ఆధారంగా చేసుకుని కోనేరు రంగారావు కమిటీ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసిందని, వాటికి అనుగుణంగానే చట్టాలు ఉనికిలోకి వచ్చాయని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. అప్పటి పీపుల్స్ వార్, ప్రజా సంఘాల నుంచి 104 సిఫారసులు వస్తే అందులో 93 అంశాలను కోనేరు రంగారావు కమిటీ పరిశీలించి పరిష్కారం కొరకు సీసీఎల్ఏ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ప్రత్యేక అధికారులు నియమించేలా సూచనలు వచ్చాయని, ప్రజల పోరాటాలతోనే చట్టాలు వచ్చాయని, భూమిపై ప్రజలు తెచ్చుకున్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.
ప్రజల అవసరాలు తీర్చేలా ఆరు గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడంతో పాటు ప్రభుత్వమూ, అధికారులు కలిసి పనిచేయాలని నొక్కిచెప్పారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచడానికి కలిసి పనిచేసి ప్రజలకు మేలు చేద్దామని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ప్రజాస్వామిక, సంక్షేమం దిశగా తీర్చిదిద్దడమే ప్రజా పాలన లక్ష్యమన్నారు. ప్రజలకు చెందాల్సిన ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వ ఆస్తులు ప్రజలకే చెందాలన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి కాస్తు కాలంను తొలగించి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. ఇకపైన ఆ పరిస్థితి ఉండొద్దన్నారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రెగ్యులర్‌గా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రతి ఏటా జమా బందీ జరిగేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో ఆ విధానం అటకెక్కిందని, రెవెన్యూ సదస్సులు పెట్టకపోవడంతో రైతులు ఇబ్బందుల్లో పడ్డారన్నారు.
అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, పోరాటాలతో ప్రజలకు దక్కిన భూములను గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా ‘పార్ట్-బీ’లో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. ఈ భూములను క్లియర్ చేయడానికి సిస్టమ్ కూడా లేకుండా చేయడంతో ఇబ్బందులు పెరిగాయన్నారు. ప్‌ిజలకు సంబంధించిన భూములు కొంతమంది ఆధీనంలోకి వెళ్లాయని, ప్రభుత్వ భూములు కూడా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రవ్యాప్తంగా అసైన్ చేసి పంపిణీ చేసిన భూముల వివరాలు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూములు, వాటిని ఏ అవసరాల కోసం వాడింది, వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి విస్తీర్ణమెంత తదితర అన్ని వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.
తెలంగాణలో భూముల కోసమే పోరాటాలు :
తెలంగాణలో జరిగిన ప్రతీ పోరాటం భూమి కోసమేనని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగానీ, ఆ తర్వాత జరిగిన నక్సల్‌బరీ ఉద్యమంగానీ, 1969 తెలంగాణ పోరాటంగానీ.. భూమి కోసమే జరిగాయన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే గత ప్రభుత్వాలు టెనెన్సీ యాక్ట్, భూ సంస్కరణల చట్టం లాంటివి తెచ్చి రైతులకు భూములపై హక్కలు కల్పించాయని గుర్తుచేశారు. ఈ హక్కులను గత ప్రభుత్వం ధరణి పేరిట కాలరాయడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం ఆపద్బంధు, పిడుగుపాటుతో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం లాంటివాటికీ నిధులను ఆపేసిందని గుర్తుచేశారు. వచ్చే సంవత్సరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం తయారు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎంకు హౌజింగ్ డిపార్టుమెంటు అధికారులు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు లక్షల ఇండ్లలో 67 వేల ఇండ్లు కంప్లీట్ అయ్యాయని, మిగతావి నిర్మాణం దశలో ఉన్నాయని వివరించారు.
నకిలీ విత్తన సమస్యను అరికట్టాలి :
రానున్న బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు చెందిన ప్రతిపాదనలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్షించారు. రైతు బీమా, పంటల బీమా, రైతుబంధు (రైతుభరోసా), ఆయిల్ పామ్ పంటల సాగు, ధాన్యం కొనుగోలు, డ్రిప్ ఇరిగేషన్ తదితరాలకు కేటాయించిన నిధుల ఖర్చులపై వివరాలను అధికారుల నుంచి మంత్రులిద్దరూ అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా సంపూర్ణంగా అరికట్టాలని, విత్తన తయారీలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలోని పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థుల యూనిఫామ్ గురించి ఆరా తీశారు. ఈ ఏడాదికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులు వివరించారు.