- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ration Cards: ముఖ్య గమనిక.. లబ్ధిదారుల ఎంపిక అక్కడే..!

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు(Ration Cards) మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) చెప్పిన విషయం తెలిసిందే. అయితే గ్రామ సభల్లోనే రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేయడం జరుగుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రేషన్ కార్డుతో పాటు రైతు భరోసా(Raith Barosa) లబ్ధిదారులను సెలక్ట్ చేస్తామన్నారు. గ్రామ సభల్లో అయితేనే పారదర్శకంగా రేషన్ కార్డుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. రైతు భరోసాపై ఎలాంటి షరతులు ఉండవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే రేషన్ కార్డుల లిస్టులపై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డులకు ఇంకా ఎలాంటి లిస్టు రెడీ కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Cm Batti Vikramarka) స్పష్టం చేశారు.