సంక్రాంతి వేళ ‘పాలమూరు’కు DCM భట్టి శుభవార్త

by Gantepaka Srikanth |
సంక్రాంతి వేళ ‘పాలమూరు’కు DCM భట్టి శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు(Palamuru) జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కీలక పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26 నుంచి తెల్ల రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయాలని పిలుపునిచ్చారు. ఏడాదిలో 56 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తుచేశారు.

బీఆర్ఎస్(BRS) హయాంలో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. అంతకుముందు పాలమూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధికి రానున్న ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని కూడా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా కృష్ణానీటిలో ప్రతిచుక్కను ఒడిసిపట్టి తాగునీటితోపాటు 12లక్షల ఎరకాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed