- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhatti Vikramarka: మాపై బీఆర్ఎస్ కుట్రలు.. అయినా చేసి చూపించాం: భట్టి విక్రమార్క
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరకుండా కులగణన వంటి చారిత్రాత్మక కార్యక్రమాన్ని కొద్ది మంది దోపిడీ దారులు అడ్డుకోవాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సమాజాన్ని దోచుకున్న వారే ఈ రకంగా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. గురువారం గాంధీ భవన్ (Gandhi Bhavan) లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలు, కార్యకర్తల ఆశలను, ఆలోచనలను నిరాశ పరచబోమన్నారు. అందుకోసమే ఓ వైపు ప్రజాభవన్ లో ప్రజావాణి నిర్వహిస్తూనే మరోవైపు గాంధీ భవన్ లోనూ మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలన్నారు. గడీల మధ్య నుంచి బీఆర్ఎస్ పాలన సాగిస్తే ఇవాళ ప్రజా ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తోందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులే ప్రజల దగ్గరకు వెళ్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ కుటలను ఛేదించి నియామకాలు:
విద్య, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని భట్టి చెప్పారు. భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు చేయని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. డైట్ చార్జీలను కూడా పెంచామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని పదేళ్లలో ఒక్క సారి కూడా బీఆర్ఎస్ (BRS) గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు. మేము ఎలాంటి లీకేజీలు లేకుండా గ్రూప్-1 నిర్వహించి చూపించామన్నారు. తాము ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అనేక కుటిల ప్రయత్నాలు చేసిందని వాటన్నింటిని నిలదొక్కుకుని ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ఆర్టీసీ బస్సుల కొనుగోళ్లు మహిళా సంఘాలకు:
రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న మహిళలు పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం చెప్పారు. దేశంలో పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి అంటే అదానీ, అంబానీలే గుర్తుకు వస్తారు. కానీ సోలార్ విద్యుత్ ప్లాంట్లను తాము మహిళా సంఘాలకు అప్పగించబోతున్నామన్నారు. ఈ మేరకు మహిళా సంఘాలతో ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎంవోయూ చేసుకుదంని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సులను సైతం మహిళా సంఘాల ద్వారానే కొనుగోలు చేస్తామన్నారు.