మల్లారెడ్డి టీచింగ్ హాస్పిటల్ ఆరోగ్య ఎంపానెల్ రద్దు చేయండి

by Mahesh |
మల్లారెడ్డి టీచింగ్ హాస్పిటల్ ఆరోగ్య ఎంపానెల్ రద్దు చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీమ్‌డ్ యూనివర్సిటీ పేరిట తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల ఆరోగ్యశ్రీ ఎంపానల్‌మెంట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్‌ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. డీమ్‌డ్ యూనివర్సిటీల వల్ల స్థానిక విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి రవి ప్రసాద్, తదితరులు ఆదివారం వినతి పత్రం అందజేశారు.

మల్లారెడ్డితో పాటు అపోలో, సీఎంఆర్, ప్రతిమ, ఆర్వీఎం మెడికల్ కాలేజీలు కూడా డీమ్‌డ్‌ యూనివర్సిటీ స్టేటస్‌ కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని, ఆయా కాలేజీలకు కాలేజీలకు ప్రభుత్వం నుంచి అందుతున్న అన్ని రకాల ప్రోత్సాహాలను నిలిపివేయాలని, ఆయా కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌ను రద్దు చేయాలని మంత్రిని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలకు డీమ్‌డ్ హోదా ఇవ్వకుండా యూజీసీని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Next Story