- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీ మద్యం కుంభకోణం: అరుణ్ పిళ్ళైని అరెస్టు చేసిన ఈడీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థలు.. తాజాగా మరో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నిహితుడు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైను సోమవారం రాత్రి 11 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదుపులోకి తీసుకున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. రామచంద్రపిళ్లై అరెస్ట్‌తో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేసినట్లైంది. వైద్య పరీక్షల అనంతరం ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లైను కోర్టుకు తరలించనున్నారు.
ఈడీ రిమాండ్‌లోకి తీసుకుని మరిన్ని విషయాలు ఆరా తీసే అవకాశముంది. లిక్కర్ స్కాంలో అవకతవకలపై ఇటీవల రెండు రోజులపాటు అరుణ్ పిళ్ళైని ఈడీ ప్రశ్నించింది. కాగా, సీబీఐ అధికారులు తొలుత అరుణ్ రామచంద్రపిళ్లైపై అభియోగాలు నమోదు చేశారు. ఈ విషయమై హైదరాబాద్ కేంద్రంగా పలుదఫాలు సోదాలు నిర్వహించారు. అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక సమాచారాన్నిదర్యాప్తు సంస్థలు సేకరించాయి. ఈ కేసులో దాఖలు చేసిన చార్జీషీట్లలో అరుణ్ రామచంద్రపిళ్లై పేరును కూడా దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి. రామచంద్రపిళ్లైకి చెందిన హైదరాబాద్ శివారులోని 2 కోట్ల విలువైన ఆస్తులను(భూమిని) ఈడీ అటాచ్డ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
రామచంద్రపిళ్లై కొందరికి బినామీగా వ్యవహరించినట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ, సీబీఐలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఏకంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం మనీష్ సిసోడియాను సీబీఐ రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే అరెస్టైన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు.