Delhi Liquor Scam Case: కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ స్పెషల్ కోర్టు‌లో విచారణ

by Shiva |
Delhi Liquor Scam Case: కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ స్పెషల్ కోర్టు‌లో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఇటీవలే సీబీఐ అరెస్ట్ చేసిన విషయం విదితమే. కేసుకు సంబంధించి ఈడీ పలుమార్లు ఆమెను విచారించి మార్చి 15న అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె జైలులో ఉండగానే సీబీఐ అధికారులు ఈ నెల 11న అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23 వరకు కవిత తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది.

Advertisement

Next Story